రాత పరీక్షలో విజయానికి.. ఈ ప్రిప‌రేష‌న్ టిప్స్‌తో..

0
76


రాత పరీక్షలో విజయానికి.. ఈ ప్రిప‌రేష‌న్ టిప్స్‌తో..

పేపర్‌–1 (జనరల్‌ మెడిసిన్, పిడియాట్రిక్స్‌) లో..కార్డియాలజీ, రెస్పిరేటరీ డిసీజెస్, గ్యాస్ట్రో ఇంటెస్టినల్, జెనిటో యూరినరీ, న్యూరాలజీ, హెమటాలజీ, ఎండోక్రైనాలజీ, మెటాబాలిక్‌ డిసీజెస్, ఇన్ఫెక్ష¯Œ్స–కమ్యూనికబుల్‌ డిసీజెస్, న్యూట్రిషన్‌/గ్రోత్, డెర్మటాలజీ, మస్కులోస్కెలిటిల్‌ సిస్టమ్,సైకియాట్రీ, జనరల్‌ అంశాలపై పట్టు సాధించాలి. దీంతోపాటు పిడియాట్రిక్స్‌కు సంబంధించి.. కామన్‌ చైల్డ్‌హుడ్‌ ఎమర్జెన్సీస్, బేసిక్‌∙న్యూబార్న్‌కేర్, నార్మల్‌ డెవలప్‌మెంటల్‌ మైల్‌స్టోన్స్, ఇమ్యునైజేషన్‌ ఇన్‌ చిల్డ్రన్, ప్రత్యేక అవసరాలున్న చిన్నారులను గుర్తించడం, వారికి చికిత్స మార్గాలు తదితర అంశాలపై అభ్యర్థులు దృష్టి పెట్టాలి.

పేపర్‌–2కు ఇలా..

పేపర్‌–2లోని మూడు విభాగాలకు సంబంధించి దృష్టి పెట్టాల్సిన అంశాలు..

సర్జరీ: జనరల్‌ సర్జరీకి సంబంధించి గాయా లు, కాలేయం, రక్త నాళాలు, పేగులు, కణితులు, ఉదర సంబంధ సమస్యలు తదితరాలకు సంబంధించిన శస్త్రచికిత్సS అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. వీటితోపాటు యూరాలజికల్‌ సర్జరీ, న్యూరో సర్జరీ, ఈఎ¯ŒSటీ సర్జరీ, థొరాసిక్‌ సర్జరీ, ఆర్థోపెడిక్‌ సర్జరీ, ఆప్తమాలజీ, అనస్థీషియాలజీ, ట్రామటాలజీ అంశాలను అవపోసన పట్టాలి.

గైనకాలజీ అండ్‌ ఆబ్‌స్టెట్రిక్స్‌: గైనకాలజీలో అప్లయిడ్‌ అనాటమీ, అప్లయిడ్‌ ఫిజియాలజీ, జెనిటల్‌ ట్రాక్ట్‌లో ఇన్ఫెక్షన్లు, నియోప్లాస్మా, గర్భాశయం స్థానంలో మార్పులు, కన్వెన్షనల్‌ కాంట్రాసెప్టివ్స్, యూడీ, ఓరల్‌ పిల్స్, ఆపరేటివ్‌ ప్రొసీజర్, మెడికల్‌ టెర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ అంశాలపై దృష్టి సారించాలి.

ప్రివెంటివ్‌ అండ్‌ సోషల్‌ మెడిసిన్‌: సోషల్‌ అండ్‌ కమ్యూనిటీ మెడిసిన్, కాన్సెప్ట్‌ ఆఫ్‌ హెల్త్, డిసీజ్, ప్రివెంటివ్‌ మెడిసిన్, హెల్త్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ ప్లానింగ్, డెమోగ్రఫీ అండ్‌ హెల్త్‌ స్టాటిస్టిక్స్, ఎన్విరా¯ŒSమెంటల్‌ హెల్త్, న్యూట్రిషన్‌ అండ్‌ హెల్త్, ఆక్యుపేషనల్‌ హెల్త్, జెనిటిక్స్‌ అండ్‌ హెల్త్, ఇంటర్నేషనల్‌ హెల్త్, మెడికల్‌ సోషియాలజీ అండ్‌ హెల్త్‌ ఎడ్యుకేషన్, మెటర్నల్‌ అండ్‌ చైల్డ్‌ హెల్త్, నేషనల్‌ ప్రోగ్రామ్స్‌ అంశాలపై ప్రత్యేక శ్రద్ధతో చదవాలి.

అకడమిక్‌ పుస్తకాలు ఆలంబనగా..

రాత పరీక్షలో మెరుగ్గా రాణించడానికి అభ్యర్థులు తమ అకడమిక్‌ పుస్తకాలనే ఆలంబనగా చేసుకుని ముందడుగు వేయాలని నిపుణులు సూచిస్తున్నారు. సిలబస్‌ను పరిశీలించి.. అకడమిక్స్‌లోని అంశాలతో బేరీజు వేసుకుంటూ.. అప్లికేషన్‌ దృక్పథంతో చదవాలి. పాత ప్రశ్న పత్రాల సాధన కూడా ఎంతో ఉపకరిస్తుంది.

ఇంకా చ‌ద‌వండి : part 1: ఎంబీబీఎస్‌తో కేంద్ర సర్కారీ కొలువు.. సీఎంఎస్‌ఈ సాధనతో..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here