యాపిల్‌ ఎంపిక ప్రక్రియలో ఇలా.. కొలువు సాధించండ‌లా..

0
64


యాపిల్‌ ఎంపిక ప్రక్రియలో ఇలా.. కొలువు సాధించండ‌లా..

యాపిల్‌ ఎంపిక ప్రక్రియలో.. ముందుగా సంబంధిత ఉద్యోగ ప్రకటనను అనుసరించి వచ్చిన దరఖాస్తుల స్క్రీనింగ్‌ మొదలవుతుంది.

 స్క్రీనింగ్‌లో భాగంగా తొలుత అభ్యర్థుల ప్రొఫై ల్‌ ఆధారంగా ప్రశ్నలు అడుగుతారు. ఇవి ప్రధానంగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి సదరు ఉద్యోగానికి సరితూగుతాడా అనేది తెలుసుకోవడంతోపాటు అకడమిక్‌ నేపథ్యంపైనా ప్రశ్నలు ఉంటాయి.

ఆ తర్వాత టెలిఫోనిక్‌ ఇంటర్వూ నిర్వహిస్తారు. ఇందులో సంతృప్తికరంగా సమాధానాలిస్తే.. ఆ తర్వాత మూడు లేదా నాలుగు రౌండ్లలో ఇంటర్వూలు జరుగుతాయి. వీటిల్లో టెక్నికల్, హెచ్‌ఆర్‌ రౌండ్లు ఉంటాయి. టెక్నికల్‌ ఇంటర్వూలు రెండు రౌండ్లలో నిర్వహిస్తారు. వీటిలో ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌పై ప్రశ్నలు అడుగుతారు. ఇందులో విజయం సాధిస్తే.. హెచ్‌ఆర్‌ రౌండ్‌ ఇంటర్వూకు హాజరవ్వాల్సి ఉంటుంది.

హెచ్‌ఆర్‌ రౌండ్‌ ఇంటర్వూలో.. టెక్నికల్, పర్సనల్, అకడమిక్‌ ప్రొఫైల్‌ సంబంధిత ప్రశ్నలు అడుగుతారు. కొన్ని సందర్భాల్లో గ్రూప్‌ డిస్కషన్స్‌తో ఇంటర్వూ ప్రక్రియ మొదలవుతుంది. 15 మంది అభ్యర్థులను ఒక బృందంగా ఏర్పాటు చేసి.. సామాజిక సంబంధిత అంశాలపై చర్చించమని అడుగుతారు. ఆ తర్వాత టెలిఫోనిక్‌ ఇంటర్వూ జరుగుతుంది. అనంతరం మరోసారి టెక్నికల్, హెచ్‌ఆర్‌ రౌండ్‌ ఇంటర్వూలు, రిటెన్‌ టెస్ట్‌లు నిర్వహిస్తారు.

వీటన్నింటిలోనూ విజయం సాధిస్తే.. ఉద్యోగ విధులు, వేతనాలు, ఇతర ప్రోత్సాహకాలు, నిబంధనల గురించి తెలియజేసి.. అభ్యర్థుల సమ్మతిని తెలుసుకుంటారు. దాని ఆధారంగా ఆఫర్‌ లెటర్‌ పంపిస్తారు. కంపెనీ అవసరాలు, కోరుకునే నైపుణ్యాలపై అవగాహన పెంచుకొని.. సమగ్ర ప్రిపరేషన్‌తో ఎంపిక ప్రక్రియకు హాజరైతే.. యాపిల్‌ కొలువు సొంతం చేసుకోవచ్చు.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here