బీటెక్‌లో క్రేజీ కోర్సు.. సీఎస్‌ఈ కెరీర్‌ అవకాశాలు..

0
95


బీటెక్‌లో క్రేజీ కోర్సు.. సీఎస్‌ఈ కెరీర్‌ అవకాశాలు..

ఇంజనీరింగ్‌లో ఎన్నో బ్రాంచ్‌లు ఉన్నాయి. వీటికి తోడు కొత్తగా మరికొన్ని అందుబాటులోకి వస్తున్నాయి. బ్రాంచ్‌లు ఎన్నున్నా.. విద్యార్థుల తొలి ఛాయిస్‌ మాత్రం.. కంప్యూటర్‌ సైన్సే! టాపర్స్‌ నుంచి సగటు ర్యాంకర్స్‌ వరకూ.. ఎక్కువ మంది కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ (సీఎస్‌ఈ) సీటే కావాలంటున్నారు. ఈ నేపథ్యంలో.. విద్యార్థుల్లో కంప్యూటర్స్‌ సైన్స్‌ పట్ల క్రేజ్‌కు కారణాలు.. కంప్యూటర్‌ సైన్స్‌తో లభించే కెరీర్‌ అవకాశాల గురించి తెలుసుకుందాం..

ఐఐటీల నుంచి స్థానిక ఇంజనీరింగ్‌ కాలేజీల వరకూ.. కంప్యూటర్‌ సైన్స్‌ సీట్లు నిండిన తర్వాతే మిగిలిన బ్రాంచ్‌ల వైపు విద్యార్థులు చూస్తున్నారు. దీనికి కారణాలు అనేకం. తల్లిదండ్రులు, సీనియర్ల సలహాలు, ఐటీ రంగం కొలువుల కల్పతరువుగా మారుతుండటం, ఆకర్షణీయమైన పే ప్యాకేజీలు.. విద్యార్థులను సీఎస్‌ఈ వైపు మళ్లిస్తున్నాయి. ముఖ్యంగా సీఎస్‌ఈతో దేశ విదేశాల్లో టాప్‌ కంపెనీల్లో కొలువులు లభిస్తుండటంతో ఎక్కువ మంది కంప్యూటర్‌ బ్రాంచ్‌ వైపు ఆకర్షితులవుతున్నారు.

సాంకేతిక విప్లవం..

ప్రస్తుతం మన జీవితాల్లో కంప్యూటర్‌ విడదీయలేని భాగమైంది. ఇంటర్నెట్‌ విస్తరణ.. ఈకామర్స్‌ విప్లవం. మరోవైపు ప్రతి పనికీ యాప్‌లు వచ్చాయి. ఈ సాంకేతిక విప్లవం వెనుక కంప్యూటర్‌ అభివృద్ధి కీలకంగా నిలుస్తోంది. దాంతో సీఎస్‌ఈ పూర్తి చేసిన అభ్యర్థులకు స్కిల్స్‌ ఉంటే భవిష్యత్‌ పరంగా ఎలాంటి ఢోకా ఉండట్లేదు. నెట్‌వర్క్, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్, డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, మెషిన్‌ లెర్నింగ్‌ నైపుణ్యాలు కలిగిన అభ్యర్థులకు ఐదంకెల వేతనాలతో కార్పొరేట్‌ రంగం స్వాగతం పలుకుతోంది.

సరితూగే బ్రాంచ్‌..

ఇంటర్మీడియెట్‌ పూర్తయిన వారిలో అధిక శాతం మంది సీఎస్‌ఈలో చేరి.. ఐటీ రంగంలో స్థిరపడాలని కలలు కంటున్నారు. సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌ సమాచార వ్యవస్థల రూపకల్పన, ఐటీ అప్లికేషన్స్, నిర్వహణ తదితరాల సమాహారాన్ని కంప్యూటర్‌ సైన్స్‌గా పిలుస్తారు. అనలిటికల్‌ స్కిల్స్, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ స్కిల్స్, క్రియేటివిటీ, క్రిటికల్‌ థింకింగ్‌ తదితర నైపుణ్యాలున్న అభ్యర్థులకు సీఎస్‌ఈ బ్రాంచ్‌ చక్కగా సరిపోతుందని చెప్పొచ్చు.

తాజా ట్రెండ్స్‌..

కంప్యూటర్‌ సైన్స్‌ ఎప్పటికప్పుడు కొత్త అప్లికేషన్స్, ప్రాజెక్టులను వినియోగదారులకు అందుబాటులోకి తెస్తోంది. యువతరం కంప్యూటర్‌ సైన్స్‌ రంగంలోకి ప్రవేశిస్తున్న కొద్దీ కొత్త కొత్త మార్పులు, ఆవిష్కరణలు వస్తున్నాయి. దీంతో అన్ని రంగాల్లో సాఫ్ట్‌వేర్‌ నిపుణుల అవసరం గణనీయంగా పెరుగుతోంది. మార్కెట్‌లో నూతన టెక్నాలజీలు అందుబాటులోకి వస్తుండటంతో కంప్యూటర్స్, సాఫ్ట్‌వేర్ల వినియోగం మరింత వేగం పుంజుకుంటోంది. ప్రస్తుతం కంప్యూటర్‌ సైన్స్‌లో డిమాండ్‌ ఉన్న స్పెషలైజేషన్స్‌.. » ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, మెషిన్‌ లెర్నింగ్, ఆటోమేషన్‌ అండ్‌ రోబోటిక్స్‌ » బయోఇన్ఫర్మాటిక్స్‌ » బిగ్‌ డేటా అండ్‌ అనలిటిక్స్‌ » సైబర్‌ సెక్యూరిటీ తదితరాలు.

ఇంకా చ‌ద‌వండి : part 2: ఈ నైపుణ్యాలుంటే టాప్‌ కంపెనీల్లో.. రూ.5లక్షల వేతనంతో ఉద్యోగాలు..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here