ఎంబీబీఎస్‌తో కేంద్ర సర్కారీ కొలువు.. సీఎంఎస్‌ఈ సాధనతో..

0
115


క్లీన్‌ ఎనర్జీ రంగంలో.. ఎంట్రీ లెవల్‌ రూ.40వేల ప్రారంభ వేతనంతో..

క్లీన్‌ ఎనర్జీ రంగంలో.. ఇంజనీర్, తత్సమాన హోదాలో ఎంట్రీ లెవల్‌లో నెలకు రూ.40వేల వరకు వేతనం లభిస్తోంది. ఆర్‌ అండ్‌ డీ విభాగంలో రూ.లక్షకు పైగా జీతభత్యాలు సొంతం చేసుకోవచ్చు.

క్షేత్ర స్థాయి కొలువులైన ప్లాంట్‌ టెక్నీషియన్స్‌ వంటి వారికి రూ.20వేల వరకు సగటు వేతనం అందుతోంది.

అకడమిక్‌ మార్గాలు..

క్లీన్‌ ఎనర్జీ విభాగాలైన సోలార్, విండ్, బయోమాస్, హైడ్రో పవర్, ఈ–వెహికిల్‌ సంస్థల్లో ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాల కోసం సంబంధిత కోర్సుల్లో చేరొచ్చు. బీటెక్‌ స్థాయిలో జియాలజీ, ఎంటెక్‌ స్థాయిలో ఎనర్జీ అండ్‌ ఎన్విరాన్‌మెంట్, సివిల్‌ ఇంజనీరింగ్, ఎనర్జీ స్టడీస్, జియో–ఇన్ఫర్మాటిక్స్, ఎన్విరాన్‌మెంటల్‌ జియాలజీ, రెన్యువబుల్‌ ఎనర్జీ, వేస్ట్‌ మేనేజ్‌మెంట్, అట్మాస్ఫియరిక్‌ ఫిజిక్స్, పెట్రోలియం ఎనర్జీ, ఎకాలజీ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఐఐటీలు, ఇతర ఇంజనీరింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లలో అభ్యసించే అవకాశం ఉంది.

ఉపాధి వేదికలు..

క్లీన్‌ ఎనర్జీకి సంబంధించి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని పవర్‌ జనరేషన్‌ కార్పొరేషన్లు, అదే విధంగా ప్రైవేట్‌ రంగంలోని ఎనర్జీ ప్రొడక్షన్‌ సంస్థలు ప్రధాన ఉపాధి వేదికలుగా నిలుస్తున్నాయి.

క్లీన్‌ ఎనర్జీ.. ముఖ్యాంశాలు..


  • క్లీన్‌ ఎనర్జీ ఇనీషియేటివ్స్‌లో ప్రపంచంలో మూడో పెద్ద దేశంగా భారత్‌.

  • సోలార్, విండ్, హైడ్రో పవర్‌ జనరేషన్, ఈ–వెహికిల్స్‌ సంస్థల్లో కొలువులు.

  • ప్రాజెక్ట్‌ సూపర్‌ వైజర్స్‌ నుంచి ఆర్‌ అండ్‌ డీ నిపుణుల వరకు పలు ఉద్యోగాలు.

  • క్లీన్‌ ఎనర్జీ విభాగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న పలు ప్రముఖ ప్రైవేట్‌ సంస్థలు.

  • 2022 నాటికి పది లక్షల ఉద్యోగాలు లభిస్తాయని ఎన్‌డీఆర్‌సీ–ఈఈఈడబ్ల్యూ నివేదిక.

  • ఫిక్కీ, ఈ అండ్‌ వై నివేదిక ప్రకారం–పోస్ట్‌–కోవిడ్‌ పరిస్థితుల్లో 15లక్షల కొలువులు.

ఇతర విభాగాల్లోనూ..

క్లీన్‌ ఎనర్జీ కార్యకలాపాలు పవర్‌ జనరేషన్‌తోపాటు అగ్రికల్చర్, హెల్త్‌కేర్‌ రంగాల్లోనూ కీలకంగా మారుతున్నాయి. అగ్రికల్చర్‌లో డీజిల్‌కి బదులు సోలార్‌ పవర్‌తో సాగు చేసే విధంగా పలు సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. అదే విధంగా ఎలక్ట్రానిక్స్‌ విభాగంలో కనీస స్థాయిలో కర్బన ఉద్గారాలు విడుదలయ్యే విధంగా టెక్నాలజీ వినియోగంలోకి వస్తోంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే.. పవర్‌ సెక్టార్‌తోపాటు ఇతర విభాగాల్లోనూ కొలువులు లభించే అవకాశముంది.

ప్రొ‘‘చంద్రశేఖర్‌ శర్మ, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ క్లైమేట్‌ ఛేంజ్, ఐఐటీ–హైదరాబాద్‌.

ఇంకా చ‌ద‌వండి : part 1: గ్రీన్‌ కెరీర్‌కి క్లీన్‌ ఎనర్జీ.. భవిష్యత్తులో 15 లక్షల కొలువులు..!

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here